ప్రభుత్వం ఆఫర్.. పిల్లల్ని కనండి.. ‘బేబీ లోన్‌’ పేరుతో రూ. 25 లక్షలు..!

by Anukaran |   ( Updated:2021-12-24 21:11:38.0  )
ప్రభుత్వం ఆఫర్.. పిల్లల్ని కనండి.. ‘బేబీ లోన్‌’ పేరుతో రూ. 25 లక్షలు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ దాదాపు 144 కోట్లకు పైగా జనాభా ఉంది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ‘ఒక్కరు ముద్దు-అసలే వద్దు’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. కానీ, తాజాగా చైనా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాలో గతకొంత కాలంగా జనాభా రేటు తగ్గిపోతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇలా కొనసాగితే రానున్న కొన్నేళ్లలోనే యువ జనాభా శాతం తగ్గిపోగా.. వృద్ధుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా జిలిన్‌ ప్రావిన్సుల్లో జనాభా రేటు భారీగా క్షీణిస్తున్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దీంతో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అంటూ ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే వివాహమైన దంపతులకు 2 లక్షల యువాన్లు (దాదాపు రూ.25లక్షలు) ‘బేబీ లోన్‌’ పేరుతో బ్యాంకు రుణం ఇప్పించేందుకు చైనాలోని జిలిన్‌ ప్రావిన్స్ సిద్ధమైంది. అంతేకాకుండా ప్రసూతి సెలవులను కూడా ఆరు నెలలకు పెంచడంతో పాటు పురుషులకు పితృత్వ సెలవులను పెంచనున్నట్లు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed