గ్రహాంతరవాసుల కోసం వెతకబోతున్న చైనా

by Harish |
గ్రహాంతరవాసుల కోసం వెతకబోతున్న చైనా
X

చైనాలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో.. ఆ దేశం ఇప్పుడు గ్రహాంతరవాసుల వెతుకులాటలో మునిగిపోబోతోంది. అందుకోసం ఐదు వందల మీటర్ల ఆపరేచర్ స్పెరికల్ టెలిస్కోప్‌ను ఉపయోగించబోతోంది. వచ్చే సెప్టెంబర్ నుంచి చైనా ఈ పనులు ప్రారంభించనుందని ఆ దేశ మీడియా చెబుతోంది. గత జనవరి నుంచి అధికారికంగా సాధారణ సైన్సు అవసరాల కోసం పని చేస్తున్న ఈ టెలిస్కోప్‌ను ఏలియన్ల వెతుకులాట కోసం ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం.

500 మీటర్ల వ్యాసం ఉన్న ఈ టెలిస్కోప్ ప్రస్తుతం అప్‌గ్రేడ్‌ల కొరత కారణంగా 300 మీటర్ల మీద ఫోకస్ చేయగలుగుతోంది. దీన్ని పూర్తి స్థాయిలో పనిచేసేలా చేస్తే సాధారణ సైన్సు పరిశోధనలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూనే గ్రహాంతరవాసుల వెతుకులాట పనులు కూడా చేయవచ్చని చీఫ్ సైంటిస్ట్ జాంగ్ టాంగ్జీ తెలిపారు. ఇప్పటివరకు భూమ్మీదకు అందుతున్న సిగ్నల్స్ సుదూర నక్షత్రాల నుంచి వస్తున్నవేనని, వాటిని గ్రహాంతరవాసులు పంపిస్తున్నారనే ఆశలు పెట్టుకోవడం సబబు కాదని ఆయన తెలిపారు. ఒకవేళ నిజంగా గ్రహాంతరవాసులు అనేవారు ఉంటే వాళ్లు పంపే సిగ్నళ్లను తమ 500 మీటర్ల టెలిస్కోస్ సులభంగా పసిగట్టగలుగుతుందన్న నమ్మకంతోనే తాము ఈ పరిశోధనలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు జాంగ్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed