- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాలోకి మళ్లీ కరోనా వైరస్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ పై దాదాపు మూడు నెలలు పోరాడి నిలువరించిన చైనా మళ్లీ దాని ముప్పును ఎదుర్కొంటున్నది. ఈ దేశం నుంచే విదేశాలకు పాకిన వైరస్ ఇప్పుడు విదేశాల నుంచి మళ్లీ చైనాకు వ్యాపిస్తున్నది. చైనాలో స్థానికంగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. కానీ, విదేశాల నుంచి వస్తున్నవారు దాన్ని వెంట పట్టుకొస్తున్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 649 మందిలో కరోనా పాజిటివ్ గా తేలింది. శుక్రవారం ఒక్కరోజే 54 కేసులు విదేశాల నుంచి దిగుమతి అయినట్టు ఆ దేశ సర్కారు వెల్లడించింది. ఈ మహమ్మారితో శుక్రవారం ముగ్గురు మరణించారు. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,295కు చేరింది. చైనా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,394కు చేరింది. విదేశాల నుంచి కరోనా కేసులు దిగుమతి అవుతున్న నేపథ్యంలో ఆ దేశం అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఒక విమానయాన సంస్థ నుంచి వారానికి ఒక దేశానికి కేవలం ఒక్క విమానమే వెళ్లేలా రేపట్నుంచి నియంత్రించనుంది.
Tags: Coronavirus, China, spread, import, contain