మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు : జిన్ పింగ్

by  |
మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు : జిన్ పింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ :

భారత్- చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తాజా పరిస్థితులు ఉన్నాయి. ఇరుదేశాలు బోర్డర్‌లో యుద్ధ సామగ్రిని తరలించడమే కాకుండా, సైనికులను భారీగా మోహరిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఓ వైపు జిత్తుల మారీ డ్రాగన్ శాంతి చర్చలకు సిద్ధమంటూనే బోర్డర్‌లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దానికి దీటుగా భారత్ సైన్యం బదులిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 75వ యూఎన్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘దేశాల మధ్య సమస్యలు ఉంటాయి. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి. మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. శాంతియుత అభివృద్దికి చైనా కట్టుబడి ఉందన్నారు. దేశ విస్తరణ, ఆధిపత్యాన్ని ఎప్పటికీ కోరుకోవడం లేదని’ చెప్పారు.


Next Story

Most Viewed