- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ కు షాకిచ్చిన చైనా.. ఇదో కొత్త పన్నాగమా ?
దిశ, వెబ్ డెస్క్ : చైనా మరోసారి తన వక్ర వక్ర బుద్దిని ప్రదర్శించింది. ఒక వైపు శాంతి చర్చలు చేద్దాం అంటూనే భారత్ వేసే అడుగులకు వంకలు పెడుతోంది. ఆఫ్ఘన్ లో శాంతి స్థాపనకు భారత్ అధ్యక్షతన జరుగుతున్న మీటీంగ్ కు డుమ్మా కొట్టనుంది. ఏవేవో కుంటి సాకులు చెప్పి ఈ మీటింగ్ కు రాలేమని చెప్పేసింది. ప్రాంతీయ భద్రత పై భారత్ అధ్యక్షతన నేడు ఢిల్లీలో కీలకమైన సమావేశం జరగనుంది. అయితే భారత్ పెట్టిన ఈ సమావేశానికి తాము హాజరుకాలేక పోతున్నామని విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ తెలిపాడు.
ఆఫ్ఘన్ లో తాలిబాన్ల పాలన మొదలైన దగ్గరి నుంచి ఇరుగు పొరుగు దేశాలు తమ భద్రతకు వచ్చే ముప్పు పై ఆందోళన చెందుతున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం ముప్పు లాంటి సమస్యల పై సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి కిర్గిస్తాన్, ఇరాన్, తజకిస్తాన్, తుర్కిమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా లు పాల్గొననున్నాయి. శాంతి సుస్థిరతలు, భద్రతా పరంగా ఎదుర్కోనున్న సవాళ్లు, ఆఫ్ఘన్ ప్రజల మద్దతు కూడగట్టడం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చలు సాగనున్నాయని భారత్ తెలిపింది.
తాలిబాన్లను అధికారికంగా చైనా గుర్తించనప్పటికీ, వెనక నుంచి సపోర్ట్ చేస్తున్న మాట వాస్తవమేననేది విశ్లేషకుల మాట. దీనికి నిదర్శనమే పోయిన నెలలో ఆఫ్ఘన్ తాత్కాలిక ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ తో చైనా విదేశాంగ మంత్రి దోహాలో చర్చలు జరపడం. ఇప్పటికే తాలిబాన్ల ప్రభుత్వానికి 31 మిలియన్ల సాయం ప్రకటించి ప్రపంచ వ్యాప్తంగా నిందలు పాలైన విషయం తెలిసిందే.