- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చైనా.. 28 గంటల్లోనే 10 అంతస్థుల భవన నిర్మాణం
దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ అసాధ్యం కాస్తా సుసాధ్యం అయ్యింది. సాంకేతికత అభివృద్ధి చెందని రోజుల్లో సాధారణంగా ఒక భవనం నిర్మాణం జరపాలంటేనే కొన్ని నెలల సమయం పట్టేది. అది కూడా అనుకున్న సమయంలో అన్ని మెటీరియల్స్‌తో పాటు కూలీల సంఖ్య సరిపడా అందుబాటులో ఉంటేనే. లేనియెడల నెలల సమయం కాస్త ఇంకా ఏడాది దగ్గరకు చేరువయ్యేది. అలాంటిది టెక్నాలజీ రీవల్యూషన్ మూలంగా నెలలు పట్టే సమయాన్ని రోజులకు.. ఆ తర్వాత రోజుల నుంచి గంటలకు పని సమయం తగ్గుతూ వచ్చింది.
నిర్మాణ రంగంలో సాంకేతికత చేరికతో ఆయా దేశాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అద్భుత నిర్మాణాలు వెలుస్తున్నాయి. జియోగ్రాఫికల్ పరంగా తక్కువగా స్థలం ఉన్న దేశాల్లో ఏకంగా గాలి మేడలు నిర్మిస్తు్న్నారు. ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించిన ఈ ఆకాశహర్మ్యాల నిర్మాణం ప్రస్తుతం ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నాయి. భారీ క్రేన్ల సాయంతో రాత్రిరాత్రికే బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగిపోతున్నాయి. నిర్మాణ రంగం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో అటు సమయంతో పాటు ఇటు డబ్బులు కూడా సేవ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. కేవలం 28 గంటల్లో రాత్రికి రాత్రే 10 అంతస్తుల భవనాన్ని నిర్మించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది డ్రాగన్ కంట్రీ చైనా.అదేలా సాధ్యమనుకుంటే.. ప్రీ ఫ్యాబ్రికేటేడ్ కంటేనర్స్‌ను భారీ క్రేన్ల సాయంతో ఒకదాని మీద ఒకటి పెట్టి, ఆ తర్వాత స్క్రూస్ బిగించి మొత్తంగా 10 అంతస్తుల భవన నిర్మాణాన్ని చాంగ్సా పట్టణంలో పూర్తిచేసింది చైనా. ప్రీ ఫ్యాబ్రికేటేడ్ అంటే ఎంటంటే.. ముందుగానే లైట్ వెయిట్ మెటీరియల్ సాయంతో బ్యాక్సులాంటి గదులను వేరే చోట నిర్మిస్తారు. వాటిని లోకేషన్‌కు తీసుకొచ్చి ఆ తర్వాత కంటేనర్స్‌ను ఒకదానిపై ఒకటి పేరుస్తారు. అవి విడిపోకుండా స్క్రూస్‌తో టైట్ చేస్తారన్న మాట. ఇలా నిర్మించిన భవనం నిలబడుతుందా అంటే ఖచ్చితంగా అని ఇంజినీర్స్ చెబుతున్నారు. అన్ని పరీక్షలు పూర్యయ్యాకే దీనిని కార్యరూపంలోకి తెచ్చినట్లు వారు చెబుతున్నారు. భూకంపాలు వచ్చినా, భారీ గాలులు వీచినా సాధారణ బిల్డింగ్ ఎలా తట్టుకుంటుందో వాటన్నింటినీ ప్రీ ఫ్యాబ్రికేటేడ్ బిల్డింగ్స్ సైతం తట్టుకుంటాయని సమాచారం. కంప్యూటర్ పరికరాలను ఎలా అయితే విడదీసి బిగిస్తారో అలానే వీటి నిర్మాణ శైలి ఉంటుంది. దీనిని మళ్లీ వేరే చోటుకు తరలించాలన్నా చాలా ఈజీ. మళ్లీ బాక్సులాంటి గదులను విడదీసి వేరే ప్లేస్‌లో బిగించుకోవచ్చు. కేవలం 28గంటల 45 నిమిషాల్లో నిర్మించిన భవనానికి సంబంధించిన టైమ్ లాప్స్ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. కాగా, కరోనా సమయంలోనూ కేవలం వారం వ్యవధిలో 1000 పడకల ఆస్పత్రిని ఇదే మాదిరిగా నిర్మించిన చైనా ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది.