పిల్లలు బయటికి ..తల్లిదండ్రులు లోనికి

by Shyam |
పిల్లలు బయటికి ..తల్లిదండ్రులు లోనికి
X

దిశ, మహబూబ్‌నగర్: పిల్లలు చేసిన పొరపాటు వారి తల్లిదండ్రుల మెడకు ఉచ్చలా బిగిసుకుంది. గద్వాల పరిధిలో చాలా రోజులు ఎవరూ బయటికి రావొద్దని అవగాహన కల్పిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. లాభం లేదని భావించిన పోలీసులు ఎవరైనా పిల్లలు అకారణంగా రోడ్ల పైకి వస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని నిబంధన పెట్టారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న 12 మంది పిల్లలను చింతల్‌పేటలో పోలీసులు పట్టుకున్నారు. వారి తల్లిదండ్రులను గుర్తించి క్రిమినల్ కేసు నమోదు చేశారు. త్వరలో కేసులు నమోదు చేసిన వారిని రిమాండు‌కు పంపుతామని పోలీసులు తెలిపారు. ఇక ముందు కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను అదుపులో పెట్టుకోకపోతే మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని చెప్పారు.

Tags: coroanvirus, lockdown, Gadwal, criminal case, parents

Advertisement

Next Story

Most Viewed