- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం : తండ్రి కారు కింద పడి తనయుడు మృతి
దిశ, ఎల్బీనగర్ : ప్రమాదవశాత్తు కార్ కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన లక్ష్మణ్, రాణి దంపతులు. వీరికి 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి భవాని అనే నాలుగేళ్ల కూతురు, సాత్విక్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. కాగా, బతుకుదెరువు కోసం ఏడాది క్రితం నగరానికి వలస వచ్చి ఎల్బీ నగర్‌లోని మన్సురాబాద్ కాస్మోపాలిటన్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్‌లో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మణ్ కారు డ్రైవర్. దీంతో అపార్ట్ మెంట్‌లో ఓ కారుని శుభ్రం చేసి ముందుకు తీసే క్రమంలో తన కుమారుడు సాత్విక్ ఆడుకుంటూ కారు ముందు చక్రాల కిందికి వచ్చాడు. ఇది గమనించని లక్ష్మణ్ కారును అలాగే ముందుకు పోనిచ్చాడు. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలైన సాత్విక్‌ను కుటుంబ సభ్యులు వెంటనే కామినేని హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అప్పటికే సాత్విక్ మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.