‘డిసెంబర్ నాటికి మల్లన్నసాగర్ పూర్తవ్వాలి’

by Shyam |
‘డిసెంబర్ నాటికి మల్లన్నసాగర్ పూర్తవ్వాలి’
X

దిశ, మెదక్: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులన్నీ డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లో మల్లన్న సాగర్ జలాశయ పనులను బుధవారం పరిశీలించారు. ప్రాజెక్ట్ పెండింగ్ అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ డిసెంబర్ మొదటి వారం లోగా పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల్లో నాణ్యత ఉండాలని సూచించారు. భూసేకరణ ఆర్అండ్ఆర్ కాలనీల అంశంపై అదనపు కలెక్టర్ పద్మాకర్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంత రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్, హరిరాం, సీఈ అజయ్ కుమార్, ఎస్ ఈ వేణు పాల్గొన్నారు.

Tags: Mallanna sagar, chief secretary irrigation, visit

Advertisement

Next Story

Most Viewed