- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవి బిడ్డకు… ‘అర్ధ’ నివాళి
‘తెలంగాణ రాష్ట్ర సాధనలో మాకు స్ఫూర్తి నిచ్చినవారిలో కొమురం భీం ఒకరు. ఆదివాసులను ఐక్యం చేసి ఆయన పోరాడిన తీరుతోనే మేము స్ఫూర్తి పొందాం. అలాంటి గొప్పవీరుడు పుట్టిన గడ్డను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్ లో మ్యూజియం నిర్మాణంతోపాటు అభివృద్ధి పనులనూ చేపడతాం. ఇందుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం” అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2014 అక్టోబర్ 8వ తేదీన ఓ ప్రకటన చేశారు. అనుకున్నట్లుగానే రూ.25 కోట్లు మంజూరు అయ్యాయి. ఆరేళ్లు గడిచిపోయాయి. అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు.
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ‘జల్.. జంగల్…జమీన్’ (నీరు, అడవి, భూమి) మీద హక్కుల కోసం 12 అటవీ గ్రామాలను ఏకం చేసి నిజాంను.. అతడి అధికారులను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన కొమురం భీం అడవి బిడ్డలకు అత్యంత ఆరాధ్యుడయ్యారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పోరాటమే తమకు స్పూర్తి అని చెప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం జోడేఘాట్లో ‘కొమురం భీం స్మారక మ్యూజియం’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది, సీఎం ఆదేశాలతో విడుదలైన నిధుల్లో ఇప్పటికీ రూ.19 కోట్ల వరకు ఖర్చయ్యాయని అధికారులు చెబుతున్నారు. మ్యూజియం నిర్మించి అందులో ఆదివాసీ పోరా టాల కళా ఖండాలు, ఇతర చిహ్నాలను ఉంచారు. లేజర్ లైటింగ్ హంపి థియేటర్ కూడా ఏర్పాటు చేశారు. థియేటర్ ఇప్పుడు పని చేయడం లేదు. రెగ్యులర్ క్యూరేటర్ లేక మ్యూజియం నిర్వ హణ అస్తవ్యస్తంగా మారింది. స్వయంగా కేసీఆర్ హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా మ్యూజియంలో పూర్తిస్థాయి సౌకర్యాల కల్పన లేదు, ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందకపోవడం విచారకరం.
అటవీ శాఖ అభ్యంతరాలంటూ
కొమురం భీం స్మారక ఉద్యానవనం విషయంలో యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఈ అభివృద్ధి పనులను చేపట్టింది. ఐటీడీఏ పీవో కర్ణన్ అభివృద్ధిపై కొంత ఆసక్తి చూపినా, ఆ తర్వాత దాని ఆలనాపాలనా పట్టించుకున్నవారు లేరనే విమర్శలు ఉన్నాయి. ఏటా కొమురం భీం జయంతి, వర్ధంతి సందర్భంగా మాత్రమే పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు జోడేఘాట్ గుర్తుకు వస్తోంది. తర్వాత మళ్లీ ఆ దినం వరకు దానిని పట్టించుకునేవారే ఉండరనే విమర్శలున్నాయి. కెరమెరి నుంచి జోడేఘాట్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికీ రెండు కిలోమీటర్ల రోడ్డు నరకానికి నకలుగానే ఉంది. అటవీ శాఖ అడ్డంకుల పేరుతో రోడ్డు నిర్మాణం జరగడం లేదు. ఆదివాసీ పోరాటాలతో పాటు స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన ఓ అమరుడు పుట్టిన గ్రామానికి రోడ్డు విషయంలో ఎందుకిన్ని అడ్డంకులే పాలకులకే తెలియాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన డబుల్బెడ్రూం ఇళ్లు కూడా ఆదివాసీలకు అందని ద్రాక్షగానే ఊరిస్తున్నాయి. ఊరటనిచ్చే విషయమేమిటంటే భీం మనవడు సోనేరావు పిల్లలకు మాత్రం ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది.
పర్యాటకం మాటేమిటి?
కెరమెరి ఘాట్లు, కొమురం భీమ్ స్వస్థలం జోడేఘాట్ తోపాటు ఇక్కడి పరిసరాలు కశ్మీరాన్ని తలపిస్తాయి. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీ మాటలకే పరిమితమైంది. జోడేఘాట్ తోపాటు బాబే ఝరి పరిసర 12 ఆది వాసీ గూడాలను కలుపుతూ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ తరువాత దానిని మరిచిపోయింది. భీమ్ ఆత్మకు ఈ ప్రభుత్వం సగం నివాళి అర్పించిందంటూ ఆదివాసులు మండిపడుతున్నారు.