- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రిలో మొదటి దాతగా కేసీఆర్.. ఏం ఇస్తున్నాడో తెలుసా?
దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దీనికి 125 కిలోల బంగారం అవసరమని వెల్లడించారు. దీనిని ప్రభుత్వం అందించడానికి సిద్ధమైనప్పటికీ.. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసేందుకు నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో మొట్ట మొదటి డోనర్‌గా తన కుటుంబం ఉండేలా..116 తులాల(కిలో 16 తులాలు) బంగారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ బృహత్కర కార్యక్రమంలో తామూ పాల్గొంటామని కొందరు ప్రముఖులు చెప్పినట్లు సీఎం తెలిపారు.
ఈ నేపథ్యంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరపున ఒక కిలో బంగారం, మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఒక కిలో బంగారం విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేగాకుండా.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెండు కిలోల బంగారం, కావేరీ సీడ్స్ అధినేత కావేరీ భాస్కర్ రావు 1 కిలో, దామోదర్ రావు కుటుంబం నుంచి 1 కిలో, చినజీయర్ పీఠం నుంచి 1 కిలో బంగారాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల నుంచి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఒక్కో గ్రామం నుంచి రూ.11 ఇచ్చినా సరిపోతుందని, తెలంగాణ ప్రజలందరి నుంచి ఈ భావన రావాలని ముఖ్యమంత్రి కోరారు.