- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అలా పుంజుకోవాలంటే ఇదొక్కటే మార్గం: చిదంబరం
దేశవ్యాప్తంగా రోడ్డు, విమానయాన సేవలు ప్రారంభించాలని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం రవాణాను పునరుద్ధరించడం తప్ప మరో గత్యంతరం లేదన్నారు. ఈ మేరకు చిదంబరం సోమవారం ఓ ట్వీట్ చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన వివిధ స్టేషన్‌లకు రైళ్లను నడపనుంది. ఇందుకోసం సోమవారం నుంచి ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కూ అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిదంబరం ఆహ్వానించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రోడ్డు, విమానయాన సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. కాగా, లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని, వలస కూలీలకు ఉపశమన ప్యాకేజీ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.