పేడను కొంటాం.. కేజీకి ఎంతో తెలుసా..?

by Shamantha N |
పేడను కొంటాం.. కేజీకి ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఛత్తీస్‌‌గఢ్ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. జూలై 20న గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద కిలో పేడను రూ.1.50కి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. జూలై 20న హరేలీ పండగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. వ్యవసాయం పనుల ప్రారంభం సందర్భంగా ఏటా హరేలీ పండగను నిర్వహిస్తారు. ఈ సందర్బంగా గోధన్ న్యాయ్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పేడను ఉపయోగించి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తారు.

గోధన్ న్యాయ్ పథకం కోసం అందరికీ కార్డులు జారీ చేస్తారు. ప్రతి రోజూ అమ్మిన పేడ వివరాలను అందులో నమోదు చేస్తారు. స్వయం సహాయక బృందాలు ఇంటింటికీ వెళ్లి పేడను సేకరిస్తాయి. అనంతరం కొనుగోలు తేదీ, ఎంత పేడ అమ్మారు? అనే వివరాలు కార్డులో నమోదు చేస్తారు. ప్రతి 15 రోజులకు ఓసారి ఆన్‌లైన్ ద్వారా లబ్ధి దారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తారు. పథకాన్ని పర్యవేక్షించేందుకు గ్రామ స్థాయింలో గోధన్ కమిటీలు, పట్టణ స్థాయిలో పురపాలక సంఘాలు పనిచేస్తాయి. గోధన్ న్యాయ్ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బగేల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed