మంత్రి కేటీఆర్‌పై చెరుకు సుధాకర్ ఫైర్.. పోటీదారుడిని చూపించాలంటూ సవాల్

by Shyam |   ( Updated:2021-10-19 07:54:16.0  )
మంత్రి కేటీఆర్‌పై చెరుకు సుధాకర్ ఫైర్.. పోటీదారుడిని చూపించాలంటూ సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్‌ఎస్ అధ్యక్ష ప‌ద‌వికి కేసీఆర్ కాకుండా ఆ పార్టీలో ఒక్క పోటీదారుడిని అయినా చూప‌గ‌ల‌రా అంటూ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. కేసీఆర్ కుటుంబం కాకుండా డిప్యూటీ సీఎం, హోం మంత్రి ప‌ద‌విలో ఉన్న మంత్రుల‌ను కూడా బిల్ల బంట్రోతుల‌ను చేసి నీతి వ్యాఖ్యలా? అంటూ విమర్శలు చేశారు. ఇప్పటికే ప‌దునైన వ్యాఖ్యలు, స‌వాళ్లతో తెలంగాణ‌లో ఒక ప‌క్షానికి ధైర్యం నింపి, నైతికంగా గెలిచిన ఈటల‌పై ఎందుకు కుట్రలు చేస్తున్నారో.. కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, రేవంత్‌రెడ్డికి ప‌నికిరాని స‌వాళ్లు ఎందుకు అంటూ ఆయన నిలదీశారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ తెచ్చుకోవాలని, కాంగ్రెస్‌లో భ‌ట్టి విక్రమార్కది ఏమీ న‌డుస్తలేద‌ని కేటీఆర్ పిచ్చి వ్యాఖ్యలు ఎందుకు చేయాలంటూ చెరుకు సుధాకర్ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story