- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీటి లోపల రూబిక్స్ సాల్వ్.. న్యూ రికార్డ్!
దిశ, వెబ్‌డెస్క్: రూబిక్స్‌ను సాల్వ్ చేయడం మామూలు వాళ్లకు కొద్దిగా కష్టమే.. అంటే రెండు యూట్యూబ్ వీడియోలు చూసి ఐదు రోజులు ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు. కానీ అంత ప్రయత్నించినా కూడా ఒక రూబిక్ క్యూబ్‌నే సాల్వ్ చేయగలుగుతారు. అలాంటివి ఆరు రూబిక్ క్యూబ్‌లు చేయాలంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడినా కూడా ఎన్నిరోజుల్లో చేయగలమనేది చెప్పలేం! కానీ నీళ్ల లోపల శ్వాస బిగబట్టుకుని ఆరు రూబిక్స్ క్యూబ్‌లను పరిష్కరించడం అంటే మాటలా? అలాంటి విన్యాసాన్ని చెన్నైకి చెందిన ఓ 25 ఏళ్ల యువకుడు విజయవంతంగా పూర్తిచేసి గిన్నిస్ రికార్డుకెక్కాడు.
ఇళయరామ్ శేఖర్ 2013 నుంచి రూబిక్స్ క్యూబ్‌లను పరిష్కరించడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ ప్రాక్టీస్ వల్లనే నీళ్ల ట్యాంకులో 2 నిమిషాల 17 సెకన్లు ఉండి, ఆరు రూబిక్స్ క్యూబ్‌లను పరిష్కరించి రికార్డు సృష్టించగలిగాడు. కేవలం స్విమ్మింగ్ గాగుల్స్ మాత్రమే ధరించి నీళ్లలో పూర్తిగా మునిగి ఇళయరామ్ రూబిక్స్ క్యూబ్ పరిష్కరిస్తున్న వీడియోను గిన్నిస్ బుక్ వారి యూట్యూబ్ చానల్‌లో చూడవచ్చు. యోగాలోని ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల తాను ఇలా నీళ్లలో ఎక్కువసేపు ఉండగలిగినట్లు ఇళయరామ్ చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా, రికార్డు కొట్టాలనే తపనతోనే సద్వినియోగం చేసుకున్నట్టు ఇళయరామ్ తెలిపారు.