ఉత్కంఠ పోరులో చెన్నై గెలుపు.. టెన్షన్ పెట్టిన కమ్మిన్స్, రస్సెల్

by Anukaran |
ఉత్కంఠ పోరులో చెన్నై గెలుపు.. టెన్షన్ పెట్టిన కమ్మిన్స్, రస్సెల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో కేకేఆర్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌‌లో.. సీఎస్కే జట్టును ప్రత్యర్థి ఆల్‌రౌండర్ రస్సెల్, కమ్మిన్స్ టెన్షన్ పెట్టారు. వారు క్రీజులో ఉన్నంత సేపు పరుగుల వరద పారింది. కానీ, మిగతా బ్యాట్స్‌మాన్ల సహాకారం లేకపోవడంతో 19.1 ఓవర్లకు 202 పరుగులు చేసి కేకేఆర్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.

టెన్షన్ పెట్టిన కమ్మిన్స్, రస్సెల్

కేకేఆర్ జట్టులో ప్యాట్ కమ్మిన్స్, రస్సెల్ చెన్నై జట్టును టెన్షన్ పెట్టారు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల మోత మోగించారు. ముఖ్యంగా ప్యాట్ కమ్మిన్స్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకు ముందు ఆండ్రూ రస్సెల్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వీరికితోడు దీనేష్ కార్తీక్ (40) పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్లు శుభ్‌మన్ గిల్‌ డకౌట్, నితీష్ రానా (9), కెప్టెన్ ఇయన్ మోర్గాన్ (7), ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ (4) దారుణంగా విఫలం అయ్యారు. ఈ నలుగురు ఆటతీరు జట్టు ఓడిపోవడానికి పెద్ద కారణం అయిందనే చెప్పొచ్చు. సీఎస్కే జట్టులో దీపక్ చాహర్ 4 వికెట్లు, లుంగి ఎంగిడి 3 వికెట్లు తీసుకొని జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఓడిపోయినప్పటికీ కేకేఆర్ జట్టు అభిమానుల హృదయాలను గెలుచుకుందని నెటిజన్లు తెగ కామెంట్లు చేయడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed