- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిరిసిల్ల రాజకీయాల్లో పదవి లేని ఓ శక్తి.. ఈ' చీటీ'
దిశ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ మేనల్లుడు, కేటీఆర్ మేనభావగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటీ నర్సింగరావు అందరికీ సుపరిచితుడు. సిరిసిల్ల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పని చేసి సంఘం అభివృద్ధికి పాటుపుడతూ.. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన నేత చీటీ నర్సింగరావు. సిరిసిల్ల టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న చీటీ.. తెరవెనక మంత్రి కేటీఆర్ మంచి చెడులు, పార్టీ బాగోగులు చూస్తూ ఉంటారు. పరోక్షంగా కేటీఆర్‌కు తెరవెనక సిరిసిల్లలో ఓ రక్షణకవచంగా పని చేస్తూ..రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక చాటుకున్నాడు. మంత్రి కేటీఆర్ 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసే క్రమంలో చీటీ నర్సింగరావు సిరిసిల్లకు టీఆర్ఎస్లో ఎంటరయ్యి 13 ఏళ్లుగా టీఆర్ఎస్ కు హర్ట్ కోర్ కార్యకర్తగా, నాయకునిగా పని చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన చీటీ నర్సింగరావు ప్రస్తుతం సిరిసిల్ల రాజకీయాల్లో ముఖ్యులు గా పని చేస్తున్నారు. సిరిసిల్లలో చీటీ నర్సింగరావు పదవి లేకున్నా పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు గౌరవిస్తారు.అంతే విధంగా పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు. 13 ఏళ్ల టీఆర్ఎస్ రాజకీయంలో చీటీ నర్సింగరావు సిరిసిల్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, నిందలు మోశారు.
మంత్రి కేటీఆర్ పై వ్యతిరేకం ఉన్న ప్రతిపక్షాలు.. రాజకీయ శత్రువులు విమర్శలు ఎక్కుపెట్టేది మొదట ఈ చీటీ నర్సింగరావు పైనే.. గతంలో చేయని తప్పుకు కూడా నర్సింగరావు పై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోని మానసికంగా కుంగిపోయి.. ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రతిపక్షాలు కేటీఆర్ ను విమర్శించాలంటే ముందు విమర్శల పాలు అయ్యేది.. ఆరోపణలు ఎదుర్కొనేది చీటీ నర్సింగరావు. సిరిసిల్లలో పరోక్షంగా అధికారాన్ని చెలాయిస్తున్నడని వివిధ ఆరోపణలు చేస్తూ కేటీఆర్ ను విమర్శిస్తూ ఉంటారు.
తెలంగాణా ఉద్యమంలో సైతం చీటీ నర్సింగరావు జైలుకెళ్లి వచ్చాడు. తెలంగాణా కోసం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణ రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడినప్పుడల్ల చీటీ నర్సింగరావు సిరిసిల్ల ముఖ్య నేతలతో కలిసి సమస్యల పరిష్కారం, టీఆర్ఎస్ పార్టీకి నష్టం కలగకుండా చూసుకోవడంతో అందె వేసిన చేయి. టీఆర్ఎస్ కు కీలక సమయాల్లో చీటీ నర్సింగరావు తెరవెనక తన మాస్టర్ మైండ్‌తో అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవితో సహ.. సిరిసిల్ల మున్సిపల్ రెబల్ కౌన్సిలర్లు అంతా టీఆర్ఎస్ జాయిన్ అయ్యేలా స్థానిక సిరిసిల్ల ముఖ్య నేతలతో స్కెచ్ వేసి సక్సెస్ అయ్యారు.
సిరిసిల్ల పట్టణ రాజకీయాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడరి ప్రవీణ్, పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, మంచె శ్రీనివాస్ తో కలిసి చీటీ నర్సింగరావు సిరిసిల్ల పట్టణ రాజకీయాల్లో కిష్ట పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించారు. చీటీ నర్సింగరావును రాజకీయంగా మైనస్ చేయడానికి సోంత పార్టీ నేతలే పలుసార్లు బురద చల్లే కార్యక్రమాన్ని నిర్వహించిన, ఇబ్బందులకు గురి చేసిన వెనక్కి రాలేదు. సిరిసిల్ల రాజకీయాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చీటీ నర్సింగరావు ఒక చెరగని ముద్ర వేసుకున్నారు.
నెరవేరని కళ..చీటీ అభిమానుల్లో నిరాశ
13 ఏళ్లుగా సిరిసిల్ల టీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న చీటీ నర్సింగరావు కు రాజకీయంగా పదవులు అంత కలసిరాలేదు. నర్సింగరావు కంటే వెనుక వచ్చిన లీడర్లకు మంచి మంచి రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. నర్సింగరావు కేటీఆర్ మేనబావ కావడం, వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యుడికి పదవి ఇస్తే విమర్శలు వస్తాయన్న కారణంతో మంత్రి కేటీఆర్ నర్సింగరావు ను పదవుల పరంగా దూరం పెడుతూ వస్తున్నరన్న చర్చ కొనసాగుతుంది. పార్టీకి కీలకంగా పని చేసి.. సిరిసిల్ల పట్టణంలో పలు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి విజయబావుటా ఎగుర వేయించిన కూడా చీటీ నర్సింగరావుకి పదవులు వరించడం లేదని ఆయన అభిమానుల్లో నిరాశ చోటు చేసుకుంది.
పార్టీ పరంగా కార్యక్రమాల్లో ప్రోటోకాల్ కూడా లేకపోవడంతో కక్కలేక, మింగలేక..తన బావమరిది కేటీఆర్ కు ఏ విషయం చెప్పుకోలేక.. కాలం వెళ్లదీస్తూ వస్తున్నాడు.రెండేళ్ల క్రితం తన పుట్టిన రోజు నాడు ఏర్పాటు చేసిన వేడుకల్లో తనకు కూడా మంచి పదవి వస్తుందని ప్రకటించి సంచలనం సృష్టించారు.కానీ ప్రకటించి రెండేళ్లు దాటిన పదవి వరించలేదు. అప్పుడప్పుడు తన బావమరిది మంత్రి కేటీఆర్‌పై కోపాన్ని ప్రదర్శిస్తూనే.. మళ్లీ టీఆర్ఎస్‌కు పని చేసుకుంటూ పోవడం చీటీ నర్సింగరావ్ కు అలవాటైపోయిందన్న వాదనాలు వినవస్తాయి. నేడు చీటీ నర్సింగరావు జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.