- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విమానం ఎక్కడం కోసం అడ్డదారులు
కరోనా లాక్‌డౌన్ తర్వాత దేశీయ విమానాన్ని ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే విమానాల్లో ఎక్కడానికి ముందు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. థర్మల్ స్క్రీనింగ్ ఏమాత్రం తేడా అనిపించినా టికెట్టు రద్దు చేసి, ప్రయాణికులను సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. కానీ ఇంటికి వెళ్లాలన్న తాపత్రయం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఒంట్లో జ్వరం లక్షణాలు ఉండి, కొద్దిగా అలసటగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ మందులు వేసుకుని విమానంలో ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో ఒక ఇద్దరు ఇలాగే చేసి పట్టబడ్డట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. శరీర ఉష్ణోగ్రత థర్మల్ స్కానర్‌లో బయటపడకుండా ఉండేందుకు ప్రయాణానికి రెండు గంటల ముందు పారాసెటిమోల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. దీంతో ఉష్ణోగ్రత తగ్గి ఆరోగ్యంగా ఉన్నట్లు చూపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇతర ప్రయాణికుల ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టినట్లుగా అవుతుంది కదా అని ప్రశ్నిస్తే సొంత ఇంటికి చేరుకోవడమే తమ లక్ష్యమని, అందుకోసం ఇలాంటి పనిచేయడానికి వెనుకాడటంలో తప్పు లేదని ప్రయాణికులు అంటున్నారు. లాక్‌డౌన్ వల్ల తాము పడ్డ ఇబ్బందులతో పోల్చితే ఇలా మోసం చేయడం పెద్ద ఇబ్బందిగా అనిపించడం లేదని వారు సమర్థించుకోవడం గమనార్హం.