- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాట్సాప్‌లో క్షుద్రపూజలు.. అప్పులన్నీ వసూలు అవుతాయని మోసం..
దిశ, మహబూబాబాద్ : ఓ వ్యక్తి తాను సంపాదించిన డబ్బును ఇతరులకు వడ్డీ రూపేనా అప్పులిచ్చాడు. సంవత్సరాలు గడుస్తున్నా అప్పు తిరిగి ఎవరు చెల్లించకపోవడంతో లోలోపల అంతర్మధనం చెందుతున్నాడు. ఎలాంటి సమస్యలున్నా మేం పరిష్కరిస్తాం అని టీవీలో వచ్చిన ప్రకటన చూసి సుమారు 18 లక్షల 50 వేలు పోగొట్టుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్లితే.. ఎండీ రజాక్ మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో తినుబండారాల వ్యాపారం చేస్తున్నాడు. తాను సంపాదించిన రూ.5 లక్షలను వడ్డీకి అప్పులు ఇచ్చాడు. అన్ని సమస్యలు తిరుస్తామని టీవీలో వచ్చిన ప్రకటన చూసి అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసి తన బాధను తెలిపారు. నీ అప్పులన్ని వసూలు అవుతాయని, కొన్ని పూజలు చేస్తామని అంగతుకులు తెలిపి దశల వారిగా 18.50 లక్షలు లాగారు. వాట్సాప్ ద్వారా పూజలు చేశారని వివరించినట్లు రజాక్ తెలిపారు. వారు పంపించిన వాట్సాప్ నెంబర్ ఆధారంగా చూస్తే ఢిల్లీలో ఉన్నట్లు చూపిస్తుండడంతో మోసం జరిగిందని తెలుసుకొని మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం టౌన్ సీఐ వెంకటరత్నం మాట్లాడుతూ రజాక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.