- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్కరోజులోనే మళ్లీ బంద్..
దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్‌ఎంసీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టనందున చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్గొండ సందర్శనకు ఎవరూ రాకూడదని అధికారులు తెలిపారు. అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్నిరోజులు మూసి ఉన్న చార్మినార్ సందర్శనకు అధికారులు సోమవారం అనుమతినిచ్చారు. ఒక్కరోజులోనే మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా ప్రదేశాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ నెల 31 వరకు సందర్శనలకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు.
ఆలోచన మానుకొండి..
కొవిడ్ నిబంధనల నిబంధనల మేరకు గోల్కొండ కోటను సందర్శనను ఒక్కరోజు మాత్రమే సందర్శకులకు అనుమతించి మళ్లీ మూసివేశారు. ఈ నెల 31 వరకు గోల్కొండ మూసి ఉంటుందని, పర్యాటకులు కోటను సందర్శించాలనే ఆలోచన మానుకోవాలని సహాయ నిర్వహణ అధికారి ఎమ్. నవీన్ కుమార్ తెలిపారు. రోజురోజుకూ కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కోటలోకి సందర్శకుల అనుమతి రద్దు చేశామన్నారు. వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు రెండు రోజుల పాటు 64 మంది కోటను సందర్శించారని తెలిపారు.