త్వరలో చంద్రబాబు కూడా అరెస్ట్…?

by srinivas |
త్వరలో చంద్రబాబు కూడా అరెస్ట్…?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయినటువంటి వైసీపీ, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ నేతల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ ఆఫీసులు, టీడీపీ నేతలపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ టీడీపీ దీక్షలు చేపట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్రపతికి, ప్రధానికి, ఉపరాష్ట్రపతికి లేఖలు రాసి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అందులో కోరారు. అటు టీడీపీకి వైసీపీ కౌంటర్ దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చింది. మొత్తంగా ఏపీలో ప్రస్తుతం రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉంటే.. బుధవారం ఉదయం నుంచే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి వద్దే భారీగా మోహరించిన పోలీసులు రాత్రి 9 గంటలకు ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటు వైసీపీ నేతలు కూడా ప్రతి విమర్శలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభితోపాటు ఇందుకు కర్త, కర్మ, క్రియ అయిన ఆ పార్టీ అధినేత చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అంబటి ఇలా వ్యాఖ్యలు చేయడంతో ‘టీడీపీ నేతలను వరుసగా అరెస్ట్ చేయిస్తున్న జగన్ త్వరలో చంద్రబాబును కూడా అరెస్ట్ చేయిస్తాడా ఏందీ…?’ అంటూ ఏపీ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed