- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ కుదేలవుతుందా?.. బాబు వ్యూహాలు పనిచేయడం లేదా?
దిశ వెబ్‌డెస్క్: టీడీపీ కుదేలవుతోందా? రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాలు పనిచేయడం లేదా? పార్టీని సుదీర్ఘ కాలం విజయవంతంగా నడిపిన చంద్రబాబు ఇప్పుడు చతికిలపడ్డారా? చంద్రబాబునాయుడి వ్యూహాలే ఆయనను ఇబ్బందులపాలు చేస్తున్నాయా? ఇంతకీ ఏపీలో టీడీపీ భవిష్యత్ ఏంటి?
గుంటూరు జిల్లాకు చెంది డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీని వీడినప్పటి నుంచి ఆ పార్టీ నుంచి వలసలు జోరందుకున్నాయి. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా 13 జిల్లాల నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారి అధినేతకు షాకిస్తున్నారు. 2004 తరువాతి పరిస్థితులు మరోసారి టీడీపీకి ఎదురవుతున్నాయి. అప్పట్లో దివంగత రాజశేఖర్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష పేరిట టీడీపీ నేతలను భారీ ఎత్తున కాంగ్రెస్‌లో చేర్చుకుని బాబును అయోమయానికి గురిచేస్తే.. ఇప్పుడు జగన్ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెబుతూనే పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే తన పార్టీలో స్థానమిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో మరోఐదేళ్ల వరకు వైఎస్సార్సీపీకి ఎదురులేని కారణంగా ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా కడప జిల్లాకి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్సీపీలో చేరనున్నారు. గతంలో తన నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవద్దంటూ పెద్ద పోరాటమే చేశారు. అయితే బాబు నేరుగా రంగంలోకి దిగడంతో మౌనం వహించారు. తాజాగా తన అనుచరులు, కార్యకర్తలతో చర్చలు జరిపిన రామసుబ్బారెడ్డి మరో మూడు రోజుల్లో జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకోనున్నాడని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు.
ఇంతలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కనిగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. బాబూరావు జగన్‌తో జట్టుకట్టేందుకు లాంఛనాలన్నీ పూర్తయినట్టు సమాచారం. తన అనుచరులతో చర్చలు పూర్తి చేసిన బాబూరావు వైఎస్సార్సీపీలో చేరడం ఇంచుమించు ఖాయమే. మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలంగా కడపలో టీడీపీ తరపున పోరాటం చేసిన సతీష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుండి తప్పుకున్న సతీష్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, చంద్రబాబుకు తనపై నమ్మకం సన్నగిల్లినందువల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
చంద్రబాబుకు తనకు మధ్య అంతరం పెరిగిందన్న సతీష్ రెడ్డి, నమ్మకం లేని చోట తానుండలేనని స్పష్టం చేశారు. పులివెందులలో ఎన్నికలెప్పుడూ కత్తిమీద సామేనన్న ఆయన, అలాంటి నియోజకవర్గంలో టీడీపీకి సుధీర్ఘంగా అండగా నిలిచానని చెప్పారు. తనపై నమ్మకం సన్నగిల్లడంతోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు. తానెక్కడున్నా పార్టీ కార్యకర్తల కోసమే పని చేస్తానని ఆయన తెలిపారు.
కాగా, రాయలసీమ నుంచి నేతలు వరుసగా క్యూకట్టడం టీడీపీ అధినేతను ఆందోళనలోకి నెడుతోంది. సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాకతలపట్టుకున్నారు. అమరావతి రాజధాని పోరాటంతో టీడీపీ కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకు పరిమితమైందని, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఆదరణ కోల్పోయిందన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని నేతలు వీడుతుండడంతో ఏపీలో కూడా టీడీపీ బలహీనపడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.