- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ 1500 మందిని ఆదుకోండంటూ బాబు లేఖలు
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖలు రాశారు. ఉత్తరాంద్రతో పాటు ప్రకాశం జిల్లాలకు చెందిన సుమారు 1500 మంది భవన నిర్మాణ కార్మికులు తమిళనాడులో చిక్కుకుపోయారని అన్నారు.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో వారికి నిత్యావసరాలు, జీవన భృతి అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లేఖల్లో కోరారు. వారి యోగ క్షేమాల గురించి వారి కుటుంబసభ్యులు ఆందోళనతో ఉన్నారని ఆయన తెలిపారు. వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించేందుకు వీలుగా వారి ప్రతినిధుల ఫోన్ నెంబర్లను లేఖలకు జతపరిచారు. కాగా, బాబు గతంలో గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రుల గురించి కూడా లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
Tags: tdp, chandrababu naidu, letters, tamil nadu, central home secretary, palaniswamy, ajay kumar bhalla,