- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ చట్టానికి దిక్కు లేదు: చంద్రబాబు
దిశ ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ మాధ్యమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వరుస ట్వీట్లలో గత ఏడాదిలో మహిళలపై చోటుచేసుకున్న దురాగతాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ చట్టం చేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం… ఆఖరికి అమలు విషయానికి వచ్చేసరికి ఆ చట్టానికి దిక్కులేకుండా చేసిందని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 నెలల పాలనలో 400కి పైగా అత్యాచారాలు, 16 సామూహిక లైంగికదాడులు జరిగాయంటే రాష్ట్రంలో నేరగాళ్లు ఎంతలా పేట్రేగిపోతున్నారో అర్థమవుతోందంటూ మండిపడ్డారు.
రాజమండ్రిలో ఒక మైనర్ దళిత బాలికను 4 రోజుల పాటు నిర్బంధించి, సామూహిక అత్యాచారం జరిపారని, ఆ బాలికను చిత్రహింసలు పెట్టారని తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులే ఆ బాలికను పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి, తద్వారా పోలీసులనే సవాల్ చేశారని ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో దళిత బాలిక, నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లెలో మరో అమ్మాయి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరో దళిత బాలిక, గుంటూరులో ముస్లిం బాలిక, నెల్లూరు మహిళపై అత్యాచారాలు… ఇప్పుడీ మైనర్ దళిత బాలికపై అత్యాచారం అంటూ ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోశారు.
ఇవి కాకుండా, నెల్లూరులో మహిళా ఎంపీడీవోపై, చిత్తూరులో దళిత మహిళా డాక్టర్‌పై దౌర్జన్యాలు, మాస్కు ధరించమన్నందుకు మహిళా ఉద్యోగినిపై ప్రభుత్వ కార్యాలయంలోనే దాడి.. ఈ ఘటనలన్నీ ఏపీలో మహిళలపై అరాచకాలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. పాలకులు స్వంత ప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే ఇటువంటి దుష్ఫలితాలే కలుగుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని బాబు డిమాండ్ చేశారు.