ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానం

by srinivas |
ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానమని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతిని కాపాడుకోవడం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. కళకళలాడిన ప్రజా రాజధాని అమరావతిని నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి గురువారానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story