- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీపై గవర్నర్, కేంద్ర హోంశాఖకు చంద్రబాబు ఫిర్యాదు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల నివాసాలపై వైసీపీ శ్రేణుల దాడులు కలకలం రేపాయి. గంజాయి స్మగ్లింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లను ముట్టించారు. ముఖ్యంగా విజయవాడలోని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంటి ఆవరణలోని కారు, బైక్ ధ్వంసం చేశారు. అక్కడితో శాంతించని నేతలు ఇంట్లోని విలువైన ఫర్నీచర్‌ను సైతం ధ్వంసం చేశారు. మరోవైపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. తొలుత రాళ్లదాడికి పాల్పడ్డారు. అనంతరం కర్రలు, రాడ్లతో టీడీపీ కేంద్ర కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు.
గవర్నర్ బీబీ హరిచందన్‌కు చంద్రబాబు ఫోన్
రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాను అధికారంలో ఉండగా విపక్షాలపై ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదని.. ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చోటు చేసుకుందని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు రౌడీలుగా మారారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ దాడులపై రాష్ట్ర గవర్నర్ బీబీ హరిచందన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని.. మీరు జోక్యం చేసుకోవాలంటూ చంద్రబాబు కోరారు.
కేంద్ర హోంశాఖకు చంద్రబాబు ఫోన్
టీడీపీ కార్యాలయాలు.. నేతల ఇళ్లపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రం హోంశాఖ అధికారులకు ఫోన్ చేశారు. దాడులపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా లేవని.. వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. తమకు కేంద్రబలగాల సాయం కావాలని కోరారు. అందుకు కేంద్ర హోంశాఖ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏపీకి కేంద్ర బలగాలను పంపనున్నట్లు టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.