- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైతిక విజయం టీడీపీదే.. తిరుపతి ఫలితాలపై బాబు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైసీపీ విజయం సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందించారు. ‘తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ నేతల అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ శ్రేణులకు నా ధన్యవాదాలు. వైసీపీ అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన టీడీపీ కార్యకర్తలను, నాయకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోరాటమే మన ఊపిరి’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ నేతల అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ శ్రేణులకు నా ధన్యవాదాలు. వైసీపీ అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన టీడీపీ కార్యకర్తలను, నాయకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోరాటమే మన ఊపిరి.(1/3)
— N Chandrababu Naidu (@ncbn) May 2, 2021
‘తిరుపతి ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. అరాచకాలు, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న వైసీపీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ కార్యకర్తల తెగువ స్ఫూర్తిదాయకం’ అని తెలిపారు.
‘అప్రజాస్వామికంగా అనైతిక కార్యకలపాలతో ఐదు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అహంభావంతో వ్యవహరించిన వైసీపీ శ్రేణులకు ఓటుతో బుద్ధి చెప్పిన తిరుపతి లోక్ సభ ఓటర్లకు అభినందనలు తెలుపుతున్నా. ఫలితం ఏదైనా నైతిక విజయం తెలుగుదేశం పార్టీదే’ అని చంద్రబాబు చెప్పారు.