సూపర్ హీరోకు చిన్నారుల నివాళులు

by Sujitha Rachapalli |
సూపర్ హీరోకు చిన్నారుల నివాళులు
X

దిశ, వెబ్‌డెస్క్ : హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మన్ ఇక లేరన్న వార్త.. యావత్ సినీ ప్రేమికులను కలచివేసింది. ‘బ్లాక్ పాంథర్’ సినిమాతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బోస్‌మన్.. తన నటనతో చిన్నారులను అమితంగా ఆకట్టుకున్నాడు. అంతేకాదు వారితో చాడ్విక్‌‌కు ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. కాగా, తమ సూపర్ హీరో చనిపోయాడని తెలిసి ఎంతగానో ఏడ్చిన చిన్నారులు.. బోస్‌మన్‌కు నివాళులు అర్పిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

చాడ్విక్ తెరపైనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోనే. తనను అభిమానించే చిన్నారులు, యంగ్‌స్టర్స్‌ను కలసేందుకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించేవాడు. రెండేళ్ల క్రితం కేన్సర్‌తో పోరాడుతున్న బాలలకు సహాయం అందించిన బోస్‌మన్.. అమెరికాలోని ఓ ఆస్పత్రిలో కేన్సర్‌ చికిత్స పొందుతున్న చిన్నారులను కలిసి ఆటబొమ్మలు అందించి వాళ్లలో ఆనందాన్ని, ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపాడు. తెరపై సూపర్ హీరోగా కనిపించిన చాడ్విక్.. ఇప్పుడు లేకపోవడంతో చిన్నారులంతా తమ ఇంట్లో ఉన్న సూపర్ హీరో బొమ్మలను పట్టుకుని ఏడుస్తున్నారు. వాటిని అందంగా డెకొరేట్ చేసి నివాళులు అర్పిస్తున్నారు. ‘చాడ్విక్ వకాండా ఫరెవర్’ పోస్ట్ పెట్టి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కాగా, ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

ఇక బాస్కెట్‌బాల్ చాంపియన్ కింగ్ వెస్ట్‌బ్రూక్.. తన కొడుకు ‘బ్లాక్ ఫాంథర్’కు ఘనమైన నివాళులు ఇచ్చాడని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. బ్రూక్ కుమారుడు ఏడేళ్ల కియాన్ మిస్సోరిలోని తన ఇంటి ముందు అవెంజర్ యాక్షన్ బొమ్మలను చుట్టూ చేర్చి ‘బ్లాక్ పాంథర్’ బొమ్మను మధ్యలో పెట్టాడు. ఆ బొమ్మ చుట్టూ పూలు, అవార్డులు, ఐరన్ మ్యాన్ గ్లోవ్స్ పెట్టి ఆయన ‘వకాండ్ ఫరెవర్’ పోజ్‌లో నిలబడి నివాళులు అర్పించాడు. ఆ చిన్నోడికి తోడు మరో ఇద్దరు పిల్లలు కూడా బ్లాక్ పాంథర్‌కు నివాళులు అర్పించారు. కియాన్ ఒక్కడే కాదు, వందలాది చిన్నారులు.. ఇలా తమ సూపర్ హీరోకు నివాళులు అర్పించడం విశేషం.

Advertisement

Next Story