- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వకాండా ఇక లేదు!
దిశ, వెబ్‌డెస్క్: మార్వెల్ సినిమా ప్రపంచంలో ‘బ్లాక్ పాంథర్’ సినిమాను ఒక మైలు రాయిగా పరిగణిస్తుంటారు. శ్వేతజాతీయుల డామినేషన్ ఉన్న సినిమా ప్రపంచంలో నల్లజాతీయుల కమ్యూనిటీకి ఒక గుర్తింపును తీసుకొచ్చిన సినిమా. అంత గొప్ప సినిమాకు అంతే స్థాయిలో న్యాయం చేయగల నటుడి అవసరం ఉంది. అదృష్టవశాత్తూ మార్వెల్ వారికి ఛాడ్విక్ బోస్‌మన్ దొరికాడు. వారు ఊహించినట్లుగానే ‘బ్లాక్ పాంథర్’ పాత్రకు ఛాడ్విక్ న్యాయం చేశారు. ‘వకాండా ఫరెవర్’ అంటూ డైలాగ్ చెప్పి, ఫిక్షనల్ ప్రపంచాన్ని అందరి మనసుల్లోనూ నింపారు. కానీ ఇప్పుడు ఆ వకాండా ఫరెవర్ అన్న గొంతు మాత్రం మనల్ని విడిచి వెళ్లిపోయింది.
గత నాలుగేళ్లుగా కొలన్ కేన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. పైగా ఆ బాధను లోలోపల భరిస్తూ షూటింగులు కూడా చేశారు. ఇది నిజంగా తీర్చలేని లోటు. లాక్‌డౌన్ టైమ్‌లో ఛాడ్విక్‌ది ఒక ఫొటో వైరల్ అయింది. ఆ ఫొటోలో ఆయన పీలగా, అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. సెలెబ్రిటీ కాబట్టి లాక్‌డౌన్‌లో ఆయన డైటింగ్ చేసి, వ్యాయామాలు చేసి అలా అయ్యుంటారని అందరూ అనుకున్నారు కానీ, లోలోపల కేన్సర్ మహమ్మారి ఆయనను తింటోందని ఎవరూ గ్రహించలేకపోయారు. చివరికి అదే కేన్సర్‌కు ఆయన బలైపోయి తన అభిమాన గణాన్ని శోకసంద్రంలోకి తోసేశారు. 1976, నవంబర్ 29న జన్మించిన ఛాడ్విక్ బోస్‌మన్ ‘బ్లాక్ పాంథర్’ మాత్రమే కాకుండా గుర్తుండిపోయే పాత్రలు ఎన్నో చేశారు. జాకీ రాబిన్‌సన్, జేమ్స్ బ్రౌన్, థార్గుడ్ మార్షన్‌ల నిజజీవిత పాత్రలను పోషించారు.