- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాయానాలకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. విదేశాల నుంచి ఇండియాకు విమానాల్లో వచ్చేవారు పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రకటించింది. ఆగస్టులోపు లేదా అంతకంటే ముందే అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రకటించిన తర్వాతి రోజే ఈ సూచనలు రావడం గమనార్హం. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం.. 14 రోజుల క్వారంటైన్‌ను పాటిస్తామని బోర్డింగ్‌కు ముందే ప్రయాణికులు హామీ ఇవ్వాలి. అందులో ఏడు రోజులు సొంత ఖర్చులతో క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ తప్పనిసరి కాకున్నా.. వారివారి మొబైల్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలన్న సూచన చేసింది. బోర్డింగ్‌కు ముందే నిర్వహించిన థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు బయటపడనివారికే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ప్రయాణానంతరం ఆయా రాష్ట్రాలు క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తుంది. ఇందులో ఏడురోజల పాటు సొంత ఖర్చులపై క్వారంటైన్‌లో ఉండాలి. అనంతరం ఐసీఎంఆర్ ప్రకారం.. టెస్టు నిర్వహిస్తారు. కరోనా పాజిటివ్ వస్తే చికిత్స ప్రారంభిస్తారు. కరోనా లక్షణాలు లేకున్నా, పాక్షికంగా కనిపించినా హోం ఐసొలేషన్ కోసం ఇంటికి పంపిస్తారు. లేదా కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తారు.