- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి గుడ్ న్యూస్.. త్వరలో ‘జాతీయ ఉపాధి విధానం’
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు పోయాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘జాతీయ ఉపాధి విధానాన్ని’ రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వివరాల ప్రకారం..గతేడాది లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2020లో మే నుంచి ఆగష్టు మధ్య నాలుగు నెలల్లో భారత్ మూడో వంతు వైట్-కాలర్ ఉద్యోగాలను కోల్పోయినట్టు సీఎంఐఈ పేర్కొంది. సమీక్షించిన కాలంలో మొత్తం 59 లక్షల ఉద్యోగాలు పోయాయని అంచనా. ఈ క్రమంలో దేశంలో ఉపాధిని పెంచేందుకు కొత్త విధానాన్ని రూపొందించేందుకు కేంద్రం యోచిస్తోంది.
ప్రతి రంగానికి సంబంధించి విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. దీనికి అవసరమైన గణాంకాలను సేకరిస్తోందని ఓ నివేదిక తెలిపింది. ఈ విధానానికి తుదిరూపు తెచ్చేందుకు కేంద్రం, లేబర్ బ్యూరో ఆఫ్ ఇండియా, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలను ఆశ్రయించినట్టు సమాచారం. ఈ విధానాన్ని రూపొందించేందుకు ఏడు నెలల కాలం పట్టనుంది. ఇందులో వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల్లో ఉపాధిని బలోపేతం చేయడానికి అధికారులు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించనున్నారని లెబర్ బ్యూరో ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ డీపీఎస్ నేగి చెప్పారు.