- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెంట్రల్ విస్టా పనులు కొనసాగుతాయ్- ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘సెంట్రల్ విస్టా’ జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్ట్ అని పేర్కొంటూ నిర్మాణ పనులు కొనసాగింపునకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా మహమ్మారి కాలంలో కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ప్రేరేపితమైనదిగా తెలిపింది. పిటిషనర్లకు రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ ప్రాజెక్ట్ ఆన్‌సైట్‌లోనే ఉంటున్నారని, అందుకే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను నిలిపేయాలని ఆదేశించే ప్రసక్తే లేదని విస్పష్టం చేసింది. ఏప్రిల్ 19న కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ఆదేశాల్లో ఆన్‌సైట్‌లో లేబర్లు ఉండే ప్రాజెక్టులు నిలిపేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్టు సీజే డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌ల డివిజన్ బెంచ్ గుర్తుచేసింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ జాతీయ ప్రాధాన్యతగల అత్యవసరమైన ప్రాజెక్ట్ అని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలూ ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్నాయని వివరించింది. నిర్దేశిత కాలంలోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉన్నదని, పనిచేస్తున్న కార్మికులకు అన్ని వసతులు అందుబాటులో ఉండి, కొవిడ్ ప్రొటోకాల్స్ అమలవుతున్నప్పుడు ప్రాజెక్టు నిలిపేయాలని ఆదేశించాల్సిన అవసరం కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఇది ప్రేరేపిత పిటిషన్ అని, ఇందులో ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది.