వైరల్ అవుతున్న కేంద్రమంత్రి వీడియో

by Shamantha N |   ( Updated:2023-03-28 14:35:41.0  )
వైరల్ అవుతున్న కేంద్రమంత్రి వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొని నినాదాలు చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విషయమేమిటంటే.. కరోనాతో మొత్తం ప్రపంచమే వణికిపోతోంది. తమకు ఎక్కడ ఆ వ్యాధి సోకుతుందోనని జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా గురించి భయపడొద్దని, పలు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, రాజకీయ నేతలు, అధికారులు.. ఇలా చాలామంది కరోనా గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. అయితే.. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటూ గత నెల 20వ తేదీన ముంబైలో పలువురు బౌద్ధ సన్యాసులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చైనా కాన్సుల్ జనరల్ టాంగ్ గుకాయ్‌తోపాటు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రితోపాటు మిగిలిన సభికులు “గో కరోనా.. గో కరోనా” అంటూ నినాదాల్ చేశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story