బెజవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం..

by srinivas |
బెజవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయవాడలో బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దసరా పండుగ పర్వదినాన ఇంద్రకీలాద్రి కనకదుర్గను దర్శించుకునేందుకు ఆయన నిన్న సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కొత్త పార్టీ ఆఫీసును ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. కాగా, నేడు అమ్మవారిని దర్శించుకున్నాక తిరిగి సాయంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ పయనం కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed