- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది : కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్చువల్ ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారయ్యిందని వ్యాఖ్యానించారు.రోజురోజుకూ తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.గ్రేటర్ పరిధిలో కరోనాకు తీసుకుంటున్న చర్యలు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర వైద్య బృందాన్ని రాష్ట్ర పెడచెవిన పెట్టిందన్నారు. కరోనా టెస్టులు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారన్నారు. హైదరాబాద్‌ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. అంతేకాకుండా, కేంద్రంపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని వివరించారు.