తప్పనిసరి అయితేనే.. ఆ దేశాలకు వెళ్లండి

by Shamantha N |
తప్పనిసరి అయితేనే.. ఆ దేశాలకు వెళ్లండి
X

కోవిడ్-19 (కరోనా వైరస్) వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు సూచనలు జారీచేసింది. తప్పనిసరి అయితేనే కొరియా, ఇరాన్, ఇటలీ వంటి దేశాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఆయా దేశాల నుంచి ఈ నెల 10 తర్వాత స్వదేశానికి వస్తున్న ప్రయాణికులను 14రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచే అవకాశముందని వెల్లడించింది. మరింత సమాచారానికి హెల్ప్ లైన్ నెం. +91-11-23978046ను సంప్రదించాలనీ, [email protected] కు మెయిల్ చేయొచ్చని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed