జగన్ సర్కార్ కి మరో షాక్.. చేతులెత్తేసిన కేంద్రం

by srinivas |   ( Updated:2021-03-09 09:22:04.0  )
ys jagan
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి షాక్ లపై షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్… రామాయపట్నం పోర్టుకు సంబంధించిన అంశాలపై కేంద్రం చేతులెత్తేసింది. తాజాగా నివర్ తుఫాన్ సాయంపైనా తప్పించుకుంది. నివర్ తుఫాను సహాయంపై వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం బదులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన రూ. 2,255.70 కోట్ల సహాయంపై తీసుకున్న చర్యలపై వివరాలను ఎంపీలు కోరారు. అయితే విపత్తు నిర్వహణ ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం తేల్చి చెప్పింది.

కేంద్రం రాష్ట్రాలకు అవసరమైన అదనపు ఆర్థిక, మౌలిక వసతుల సహాయం అందిస్తుందని కేంద్రం తెలిపింది. 2020-21లో ఏపీ ప్రభుత్వం ‘నివర్’ తుఫాను విపత్తు నిర్వహణ, వరదల కోసం రూ. 2,255.70 కోట్ల ఆర్థిక సహాయం కోరింది. కేంద్ర హోంశాఖ కు చెందిన ‘హైలెవెల్’ కమిటీ 233.49 కోట్ల రూపాయలను జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి విడుదల చేయాలని సిఫార్సు చేసింది. 2020 డిసెంబర్ లో రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం ఒక నివేదికను కేంద్రానికి అందజేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి రాష్ట్రానికి అదనపు ఆర్థిక సహాయం అందించే విషయంపై హైలెవెల్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి కోసం ఏపీకి కేంద్రం ఇప్పటికే రూ. 1,119 కోట్లు విడుదల చేసింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed