- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్సిజన్ దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీలైనంత త్వరగా ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధ పరికరాలను దిగుమతి చేసుకోవాలని, ప్రస్తుత డిమాండ్‌ను అందుకోవడానికి వాటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని, హెల్త్ సెస్‌ను ఎత్తేయాలని నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని, మూడు నెలల వరకు వర్తిస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కరోనా టీకాలపైనా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎత్తేసే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధ పరికరాలు వేగంగా అందుబాటులోకి రావడమే కాదు, వాటి ధర కూడా తగ్గుతుందని వివరించింది. అలాంటి పరికరాలకు కస్టమ్స్ క్లియరెన్స్ వేగంగా ఇవ్వడానికి రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. ఇందుకోసం కస్టమ్స్ జాయింట్ సెక్రెటరీ గౌరవ్ మసల్దాన్‌ను రెవెన్యూ శాఖ వెంటనే నామినేట్ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, వాణిజ్యం, పరిశ్రమల శాఖమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి, పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రణదీప్ గులేరియా, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ, డీపీఐఐటీ శాఖల కార్యదర్శలు, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్‌ను ఈ కిందివాటిపై ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నారు.
1. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్
2. ఫ్లో మీటర్‌తో ఉండే ఆక్సిజన్ కాన్సంట్రేటర్, రెగ్యులేటర్, కనెక్టర్లు, ట్యూబింగ్
3. వాక్యూమ్ ప్రెషర్ స్వింగ్ అబ్సర్ప్షన్(వీపీఎస్ఏ), ప్రెషర్ స్వింగ్ అబ్సర్ప్షన్(పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లు, క్రయోజనిక్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్లు(ఏఎస్‌యూ) ప్రొడ్యూసింగ్ లిక్విడ్/గ్యాసియస్ ఆక్సిజన్
4. ఆక్సిజన్ కానిస్టర్
5. ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్
6. ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంక్స్, క్రయోజనిక్ సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్స్, ట్యాంకులు
7. ఆక్సిజన్ జెనరేటర్లు
8. షిప్పింగ్ ఆక్సిజన్ ఐఎస్ఓ కంటెయినర్లు
9. క్రయోజనిక్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంక్స్ ఫర్ ఆక్సిజన్
10. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఇతర డివైజ్‌లు సహా మొత్తం 16 రకాల పరికరాలు, వస్తువులకు ఈ ఊరటనిచ్చింది.