విభజన చట్టం అంశాలపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన

by Shiva |
విభజన చట్టం అంశాలపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈనెల 16న ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన అంశలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో విభజన చట్టం అంశాలపై కేంద్రం చర్చించనుంది. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశలతో తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ‌కు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను పరిశీలించి విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ గురించి సుధీర్ఘమైన చర్చ జరపనున్నారు.

విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లోని అంశాలు విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై ఉన్నత స్థాయిలో భేటీ కావల్సి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రత్యేక అంశలపై ఫోకస్ పెట్టనుంది. అందువల్ల ఢీల్లిలో జరిగే ఈ సమావేశానికి అధిక సంఖ్యలో మంత్రులు హాజరు కావాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశం గురించి ఇప్పటికే సమాచారం అందించామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో సంబంధిత అధికారులంతా హాజరు కావాలని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed