- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
దిశ, ముషీరాబాద్: రైతాంగ వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు పుణ్యవతి డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్కొండ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.
కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసి కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. రైతు వ్యతిరేక విధానాలను విడనాడి..వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, సారంపెల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు.