అమ‌లుకాని స‌ర్కార్ హామీలు : సీఐటీయూ

by Shyam |

దిశ, న‌ల్ల‌గొండ‌ :

కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. నాటి నుంచి నేటి వరకు 10రోజులు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వాలు ప్రకటించిన సహాయం ఎవరికి అందలేదని సీఐటీయూ న‌ల్ల‌గొండ‌ జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య ఆరోపించారు. సామాన్య, మధ్యతరగతి, బడుగు, దళిత, కార్మిక వర్గ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇది కరోనా నుంచి ప్రజలను కాపడటం పోయి వారిని మరింత మానసిక, శారీరకంగా ఆర్ధిక ఇబ్బందులకు గురి చేయడమేనని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడితే.. ప్రజలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలని మాట్లాడుతారే తప్ప ప్రజలు పడుతున్న బాధలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్చించారు. కరోనా వైరస్ నుంచి ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ప్రజలు సహకరిస్తున్నా వారి బాగోగులు చూడకుండా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు,ఉపాధిహామీ, చేతి వృత్తులు,సమస్త కష్ట జీవులు కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే స్పందించి కష్టాల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు, తాము ఇస్తామన్న నగదును వెంటనే అందించాలని సీఐటీయూ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

Tags: carona, lockdown, poor people, govt help,supply necesities and money

Advertisement

Next Story

Most Viewed