- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉస్మానియా ఆసుపత్రిలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. పగిలిన వైద్యురాలి తల..
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలిపై సీలింగ్ ఫ్యాన్ ఊడి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పీజీ సెకండియర్ చదువుతున్న డాక్టర్ భువన శ్రీ సోమవారం డెర్మటాలజీ విభాగంలో ఓపి విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పరిశీలిస్తున్న క్రమంలో ఆమె తలపై సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు వెంటనే వైద్య సేవలు అందించారు. అయితే ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గతంలో కూడా ఉస్మానియా ఆసుపత్రిలో పెచ్చులు మీద పడి అనేక మంది గాయాలయిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story