- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ కరోనా వార్డులో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్
దిశ, న్యూస్‌బ్యూరో: గాంధీ ఆసుపత్రిలోని కరోనా వార్డులో (ఏడో అంతస్తు) తిరుగుతూ ఉన్న సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి కింద పడింది. సరిగ్గా అది కరోనా పేషెంట్లు ఉండే బెడ్‌పై పడటంతో ఇద్దరు పేషెంట్లకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న పేషెంట్‌తో పాటు పక్క బెడ్ మీద ఉన్న పేషెంట్‌కు కూడా గాయమైంది. కరోనా రావడంతో ఇప్పటికే మానసికంగా కుంగిపోయామని, ఇప్పుడు ఒక్కసారిగా పైనుంచి ఫ్యాన్ ఊడిపడి గాయాలపాలయ్యానని పేషెంట్ వాపోయారు. ఇప్పుడు ఏకకాలంలో రెండు చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి పాలనా యంత్రాంగం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు మాత్రం ఈ ఘటన గురించి ఇంకా తనకు తెలియదని, విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామన్నారు. మామూలు సమయాల్లోనైతే మెయింటెనెన్స్ సిబ్బంది చూసుకునేవారని, కానీ కరోనా పేషెంట్లు ఉండే వార్డు కావడంతో ఇప్పుడు అవసరం ఉన్నవారు మాత్రమే లోపలికి వస్తున్నారని, అందువల్ల ఫ్యాన్ల బోల్టులు, వైర్ కనెక్షన్లు తదితరాల గురించి తెలుసుకునే అవకాశం లేకుండాపోతోందని డాక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు.