మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సీబీఐ షాక్

by Anukaran |
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సీబీఐ షాక్
X

దిశ, ఏపీ బ్యూరో : మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కంపెనీ బినామీ పేర్లతో రూ.7వేల కోట్ల స్కాంకు పాల్పడినట్లు అభియోగం మోపింది. ఇంట్లో, కంపెనీలో పనివాళ్ల పేరుతో బ్యాంకు రుణాలు తీసుకొని దారి మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది.

పద్మావతి, బాలాజీ, యూనిక్ ఎంటర్‌ప్రైజర్‌, రుత్విక్‌ అసోసియేట్‌ పేరుతో 9 నకిలీ కంపెనీలను సృష్టించారు. వీటి పేరున కెనరా బ్యాంక్‌తోపాటు మరో 9 బ్యాంకుల నుంచి రూ. 9వేల కోట్ల రుణాలు పొందారు. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, సతీష్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

Advertisement

Next Story

Most Viewed