వైఎస్ వివేకా హత్య కేసులో ఆయుధాల కోసం సీబీఐ అన్వేషణ

by srinivas |
YS Viveka murder case
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాలపై రెండోరోజు కూడా సీబీఐ అధికారులు శోధించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ హత్యకు ఉపయోగించిన ఆయుధాలపై ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆయుధాల కోసం పులివెందులలోని రోటరీపురం వాగులో శనివారం నుంచి అన్వేషిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఆయుధాల కోసం శోధించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. వాగులో మురికినీరు ఉండడంతో, 2 ట్యాంకర్లు, 20 మంది మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. యంత్రాలతో మట్టిని తొలగించి గాలించినా ఆయుధాల జాడ లభించలేదు.

సునీల్ కుమార్ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. మున్సిపల్ సిబ్బంది రోటరీపురం వాగును సర్వే చేస్తున్నారు. సోమవారం కూడా వాగులో ఆయుధాల కోసం సీబీఐ అధికారులు అన్వేషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed