అలాంటి సినిమాలు చేయను : కేథరిన్

by Shyam |
అలాంటి సినిమాలు చేయను : కేథరిన్
X

హీరోయిన్ కేథరిన్ థెరిసా తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భామ.. ‘మద్రాస్’ మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రంతో నటిగా మంచి మార్కులు వేసుకున్న కేథరిన్.. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ రేంజ్ సంపాదించింది. కోలీవుడ్‌లో పాతుకుపోయిన బ్యూటీ.. చివరగా విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో కనిపించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మద్రాస్ సినిమా కోసం హోమ్ వర్క్ చేశానని.. అది క్యారెక్టర్‌లో జీవించేందుకు ప్లస్ అయిందని చెప్పింది. తనకు ఇదే జోనర్‌లో సినిమా చేయాలని ఏమీ లేదని.. కానీ హారర్ మూవీస్ మాత్రం చేయనని చెప్పింది. రక్తం, హింస అస్సలు చూడలేనని.. అందుకే అలాంటి సినిమాలు ఒప్పుకోనని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed