- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దళితులపై దాడులు.. జిల్లా వ్యాప్తంగా నిరసనలు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో దళితులపై కొనసాగుతున్న దాడులను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా వివిధ కుల సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన రెండు ఘటనలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై అణిచివేత, దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని మండిపడ్డారు. చివరకు సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం తాజాగా మరో ఉదాహరణగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారిలో భరోసా నింపడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను మార్గం మధ్యలోని అడ్డగించి అరెస్ట్ చేయడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వ ధోరణికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరిగే దాడులను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.