చైనాలో మరోసారి వైరస్ విజృంభణ

by vinod kumar |
చైనాలో మరోసారి వైరస్ విజృంభణ
X

చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 108 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 98 మంది విదేశాల నుంచి వచ్చినవారని అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి చైనాలో కరోనా కేసులు నమోదు కావడంలేదు. దీంతో లౌక్‌డౌన్‌ను ఎత్తివేసిశారు. అయితే, మరోసారి బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో చైనాలో రెండో విడత కరోనా వైరస్ విజృంభిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో మళ్లీ చైనాలో ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రావిన్సులో ప్రజలు సామాజిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చైనాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 82,160కి చేరింది. అయితే ప్రస్తుతం కేవలం 1156 మంది బాధితులే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హుబి ప్రావిన్సులో తాజాగా ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 3,341కి పెరిగింది.

Tags: chaina, carona, 108 positive cases, second turm

Advertisement

Next Story

Most Viewed