- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారొలిన్ మారిన్ ఒలింపిక్స్ ఆడేది డౌటే?
దిశ, స్పోర్ట్స్: స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై సందిగ్దత నెలకొన్నది. 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్‌లో పీవీ సింధును ఓడించి స్వర్ణ పతకం గెలుచుకున్న ఆమె, ఈసారి గాయం కారణంగా మెగా క్రీడలకు దూరమయ్యే అవకాశం ఉన్నది. ఒలింపిక్స్ ట్రైనింగ్ క్యాంపులో ఉన్న మారిన్ గాయం కారణంగా అసౌకర్యంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. ఎడమ మోకాలి లిగ్‌మెంట్లో గాయం కారణంగా ఆమె కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నది. తాజాగా చేసిన పరీక్షల్లో డాక్టర్లు గాయం తీవ్రతను అంచనా వేశారని మారిన్ చెప్పింది. ప్రస్తుతానికి తాను క్షేమంగానే ఉన్నానని.. త్వరలోనే పూర్తి సమాచారాన్ని ఇస్తానని పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో మారిన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నది. ఇండియా నుంచి కేవలం పీవీ సింధు మాత్రమే అర్హత సాధించడంతో భారత జట్టు బ్యాడ్మింటన్‌లో పతకాల ఆశలు తక్కువయ్యాయి. ఒక వేళ మారిన్ కనుక ఒలింపిక్స్‌కు దూరమైతే పీవీ సింధూకు కలసి వచ్చే అవకాశం ఉన్నది.