Union Bank Recruitment: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్.. ఖాళీలు, అర్హత, జీతం వివరాలివే..!

by Maddikunta Saikiran |
Union Bank Recruitment: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్.. ఖాళీలు, అర్హత, జీతం వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ ఉద్యోగాల(Bank Jobs) కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) గుడ్ న్యూస్‌ చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లోకల్ బ్యాంక్ ఆఫీసర్‌(Local Bank Officer) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు www.unionbankofindia.co.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 13 నవంబర్ 2024. ఆంధ్రప్రదేశ్(AP)లో 200 పోస్టులు, తెలంగాణా(TG)లో 200 పోస్టులు ఉన్నాయి.

పోస్టు పేరు, ఖాళీలు:

లోకల్ బ్యాంక్ ఆఫీసర్‌(Local Bank Officer) - 1500 పోస్టులు

విద్యార్హత:

అభ్యర్థులు రెగ్యులర్ విధానంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, అలాగే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థులకు కచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పది ఏళ్ల సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 ఫీజు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 70,000 పైగానే జీతం ఉండనుంది.

Advertisement

Next Story